LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday

నోరూరించే నువ్వుల లడ్డు తయారుచేయండిలా....!

చర్మసమస్యలను తగ్గించే నువ్వులు, ఎంతో బలాన్నిచ్చే జీడిపప్పు, ఖర్జూర, ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కావున తప్పని సరిగా ఇంట్లో చేసి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సాయంత్రం స్నాక్స్‌లా కూడా తినండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
నువ్వులు - ఒక కప్పు, ఎండుకొబ్బరి - పదిగ్రాములు, పల్లీలు - ఒక కప్పు, జీడిపప్పు - అరకప్పు, గసగసాలు - పదిగ్రాములు, ఖర్జూర - రెండు కప్పులు, ఎండుద్రాక్ష - అరకప్పు, యాలకులు - నాలుగు.
తయారు చేసే విధానం :
మొదట నువ్వులు వేయించి విడిగా పెట్టుకోవాలి. అదేవిధంగా పల్లీలు, గసగసాలు కూడా విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. చల్లారాక ఆ మూడింటిన మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత ఖర్జూర మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ ఖర్జూర ముద్దను నువ్వులు, గసగసాలు, పల్లీలతో చేసిన పొడిలో వేసి బాగా కలపాలి. పావు గంటసేపు అలాగే ఉంచి ఉండలుగా చేసుకుంటే నువ్వుల లడ్డులు రెడీ...

No comments:

Post a Comment