యూట్యూబ్ సైట్ లోని వివిధ ఫార్మేట్ల మరియు క్వాలిటీ (FLV, HD, Full HD) వీడియోలను డౌన్లోడ్ చెయ్యటానికి YouTube HD Downloader ఉపయోగపడుతుంది. YouTube HD Downloader టాబ్ ఆధారిత ప్రోగ్రామ్. దీనిలో ఆరు టాబ్స్ ఉంటాయి. డౌన్లోడ్ చెయ్యవలసిన వీడీయో లింక్ ని యూట్యూబ్ సైట్ నుండి కాపీ చేసుకొని YouTube HD Downloader లో మొదటి టాబ్ Youtube Tab లో Video URL దగ్గర లింక్ పేస్ట్ చేసి డౌన్లోడ్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని ’Download' బటన్ నొక్కటమే!.
వీడియో ఫైల్ డౌన్లోడ్ అవుతున్నప్పుడే మిగతా టాబ్స్ ని కూడా ఉపయోగించవచ్చు. Preview Tab లో వీడియోల ప్రివ్యూ చూడవచ్చు. Search Tab లో డైరెక్ట్ గా యూట్యూబ్ సైట్ సెర్చ్ చెయ్యవచ్చు. కావలసిన వీడియో పై డబల్ క్లిక్ చెయ్యటం ద్వారా అది Youtube Tab కి పంపబడుతుంది. Batch Tab లో మల్టిపుల్ వీడియోలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Log Tab లో లాగ్ మెయింటైన్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: YouTube HD Downloader