LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label వంటింటి చిట్కాలు. Show all posts
Showing posts with label వంటింటి చిట్కాలు. Show all posts

Friday

నోరూరించే జింజర్ ప్రాన్స్‌

కావలసిన పదార్థాలు:
ప్రాన్స్ - 200గ్రా, ఉల్లిపాయ పేస్ట్ - ఒక కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర కప్పు, అజినమోటో - టి స్పూన్, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - టీ స్పూన్, కారం - రెండు టీ స్పూన్లు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా టొమాటో సాస్ - టీ స్పూన్, సోయా సాస్ - టీ స్పూన్, ఫుడ్ (రెడ్) కలర్ - చిటికెడు,
కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం:
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసి వేడినీటిలో కాస్త ఉడికించి పక్కనపెట్టుకోవాలి. పాన్‌లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత గ్లాస్ నీరు పోసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇందులో ఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. దోరగా వేయించిన జింజర్ ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

Tuesday

వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

 

వెల్లుల్లిపాయలకు కొన్ని చుక్కలు నూనె పట్టించి రోజుంతా ఎండలో ఉంచండి. సాయంత్రం దళసరి వస్త్రంలో రెబ్బల్ని ఉంచి.. గట్టిగా రుద్దితే పొట్టు సులువుగా వూడివచ్చేస్తుంది.

కచ్చాగుల్లా ఎలా తయారు చేయాలి ?

కావల్సినవిః పాలు - ఐదు లీటర్లు, పంచదార - 200 గ్రా, మొక్కజొన్నపిండి- 10 గ్రా, యాలకులపొడి - చెంచా, నిమ్మఉప్పు
తయారీ విధానం: ఓ గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మొక్కజొన్న పిండిని కాసిని నీటితో ఉండల్లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో వేయాలి. ఆ తరువాత నిమ్మఉప్పు వేసిన నీటిని చేర్చాలి. కాసేపటికి నీరంతా పైకి తేలి ... చిక్కని పాల మిశ్రమం మాత్రమే మిగులుతుంది. దీన్ని మళ్లీ తెల్లని వస్త్రంలో ఓసారి వడగట్టాలి. బాణిలో ఈ పనీర్‌ను తీసుకుని పొయ్యిమీద పెట్టి పంచదార, యాలకులపొడి చేర్చాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక దింపేయాలి. కాస్త చల్లారాక చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే చాలు. పసందైన పాల లడ్డూలు నోరూరిస్తాయి.