LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Friday

వెనిల్లా కేక్ తయారి

కావలసినవి:
మైదాపిండి : 100గ్రా, పంచదార పౌడర్ : 50గ్రా, బేకింగ్ పౌడర్ : 1/2 చెంచా, కరిగించిన వెన్న : 50గ్రా, గుడ్డు : 1, వెనిల్లా ఎస్సెన్స్ : 1/4 చెంచా, ఐసింగ్ షుగర్ : 140గ్రా, వేడి నీళ్ళు :1 1/4గరిటెడు, గులాబిరంగు : కొద్దిగా.
తయారి:
వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేసుకోవాలి. గుడ్డులోని సొనను, వెనిల్లా ఎస్సెన్స్‌ను బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమానికి మైదాను బాగా కలిపి, అవసరమైతే కాస్త పాలు కలిపి, కాస్త జారుగా చేయాలి. పిండిని రెండు సమభాగాలుగా చేసుకుని, ఒక భాగానికి గులాబిరంగు కలపాలి. రంగు కలిపిన పిండిని, మామూలు పిండిని విడి విడిగా పేపర్ కప్పుల్లో సగానికి పోసి, ట్రేలో ఉంచి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఓవెన్‌లో 2 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. కేక్స్ చల్లారాక గ్లేజ్ ఐసింగ్‌తో అలంకరించాలి.

No comments:

Post a Comment